తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(18)
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు సోమవారం మద్దూరు మండల కేంద్రములోనీ ఆదర్శ పాఠశాలలొ ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు పరీక్షల ఇంఛార్జి విలేఖర్లకు తెలిపారు. మద్దూరు మోడల్ స్కూల్ లో 199 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. దూలిమిట్ట మండల కేంద్రములోని ఉన్నత పాటశాల లొ జరుగుతున్న పరీక్షల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగా మండల వైద్యాధికారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంఇఓ నిర్లక్ష్యంతోనే మండలంలోని అన్ని గ్రామాల్లో విద్య వ్యవస్థ కుంటుపడినట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నెల 30న పదవి విరమణ ఉందనే విద్య వ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.