Thursday , May 23 2024

మరణం ఆయనను బందించుట ఆ సాధ్యం….

-లద్నుర్ బీపీహెచ్ పాస్టర్ డేవిడ్.

  • ఘనంగా ఈస్టర్ వేడుకలు.

తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి మార్చి(31)

మద్దూరు మండలంలోని అన్ని గ్రామాలతో పాటు మద్దూరు, లద్నుర్ గ్రామాల్లో యేసు క్రీస్తు మరణించి తిరిగి రోజును (ఈస్టర్)ను క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు.ఈ సంధర్భంగా క్రైస్తవులు వనభోజనాలకు వెళ్లారు.అనంతరం లద్నుర్ పాస్టర్ టి. డేవిడ్ ఆయా గ్రామాల పాస్టర్లు యేసు పునరుత్థానం గురించి క్లుప్తంగా సందేశం అందించారు.ఈ లోకంలో మృతి చెందిన తర్వాత తిరిగి మరణాన్ని గెలిచినా ఏకైక దేవ దేవుడు యేసు క్రీస్తు మాత్రమేనని అన్నారు. అలాంటి దేవుని బిడ్డలముగా మనం ఉండడం మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుదర్శన్, లద్నుర్ బి పి హెచ్ గౌరవ అధ్యక్షులు ఏలీయా,సంఘ అద్యక్షులు ఆంద్రయ్య, ఐ ఎం వై ఎఫ్ చేర్యాల ఫీల్డ్ అద్యక్షులు జిడికంటి రాజ్ కుమార్,సెక్రెటరీ ఇలిటం రాజు,కోశాధికారి జయరాజ్, సంఘ నాయకులు మల్లారపు మనోహర్,పాకాల అధామ్,జాకబ్,ఇసాక్,జేమ్స్, పొట్ట బాబు,అశోక్, పులి ప్రవీణ్, స్త్రీలు, సంఘస్తులు, యూత్ నాయకులు, పాల్గొన్నారు.