Tuesday , July 16 2024

మత్స్య సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం…

తెలంగాణ కెరటం మక్తల్ నియోజకవర్గ ప్రతినిధి,

మక్తల్ మత్స్య సహకార సంఘం నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ శనివారం ప్రారంభమైందని ఎన్నికల అధికారి లావణ్య తెలిపారు. శనివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని సోమ, మంగళవారాల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్లు వేసేందుకు మంగళవారం తుది గడువు అని అన్నారు. పదవ తేదీ పరిశీలన ఉంటుందని, 11వ తేదీన నామినేషన్ ఉపసంహరించేందుకు చివరి గడువు అని తెలిపారు. 9 డైరెక్టర్ల పోస్టులకు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయితే 16వ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సభ్యుల సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నేతలు కోళ్ల వెంకటేష్, వాకిటి అంజయ్య, సుకన్య చంద్రశేఖర్, వల్లంపల్లి లక్ష్మణ్, కావాలి ఆంజనేయులు మేస్త్రి,రేణుక నరసింహ ,కావలి శ్రీహరి, మామిళ్ల పృథ్వీరాజ్, వాకిటి శ్యామ్, లొడ్డ అంజి, నరేందర్ , వల్లంపల్లి శివశంకర్, వాకిటి అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.