Sunday , May 26 2024

కూలిపోడానికి సిద్ధంగా ఉన్న కరెంట్ పోల్..??

పొంచి ఉన్న పెను ప్రమాదం-

పట్టించుకోని విద్యుత్ అధికారులు, భయం గుప్పిట్లో ప్రజలు.

తెలంగాణ కెరటం, కామారెడ్డి జిల్లా ప్రతినిధి ,మే 16:

కామారెడ్డి పట్టణం లోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్ వద్ద ఓ విద్యుత్ స్థంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.

దానితో అది ఎప్పుడు కూలిపోతుందో తెలియక అంగడి బజారుకు వచ్చే ప్రజలు,నిత్య అవసరాలకు వచ్చే ప్రజలు క్షణంక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. విద్యుత్ సరఫరా చేసే స్తంభం గట్టిగా గాలొస్తే చాలు కరెంటు స్తంభం కిందపడే అవకాశం ఉన్నదని ప్రజలు విద్యుత్ అధికారుల దృస్టుకి తీసుకెళ్లారు.

కరెంట్ స్తంభం పరిస్థితిని చూసి ప్రతి రోజు మార్కెట్ కి వచ్చే ప్రజలు బయోoదలన కు గురి అవుతున్నారు.
నిత్యం అటు నుండి వస్తూపోయే విద్యుత్ సిబ్బందికి ఈ విషయం తెలిసి కూడా పట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
సమస్య చిన్నదిగా కనిపించినా ఏదైనా జరగరానిది జరిగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కూలిపోడానికి సిద్ధంగా ఉండి,ప్రమాదకరంగా మారిన కరెంట్ స్తంభాన్ని తొలగించి,నూతన స్తంభం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.