Sunday , May 26 2024

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

తెలంగాణ కెరటం కౌడిపల్లి
ప్రతినిధి మార్చి 03

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు పోలియో చుక్కలు వేయడం ప్రారంభించారు. బుజరంపేట్ మరియు వెంకటాపూర్ గ్రామపంచాయతీ కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పల్స్ పోలియోను చుక్కల కార్యక్రమాన్ని డాక్టర్ మాట్లాడుతూ రవళి ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు డాక్టర్ రవళి పోలియో చుక్క‌ల‌ను వేశారు.ఈ సందర్భంగా ఈ నెల 03 తేదీ 05వ తేదీ మూడు రోజుల పాటు ఐదేండ్ల‌ లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారని అన్నారు.పిల్లల భవిష్యత్ ఆరోగ్యానికి రెండు పోలియో చుక్కలు 0-5 సంవత్సరాల పిల్లలకు తప్పక వేయించండి.పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనజ శ్యాంసుందర్ ఎంపిటిసి సత్తయ్య, లింగం, పంచాయతీ సెక్రెటరీ రాజిరెడ్డి, ఏ ఎన్ ఎం మాధురి,డాక్టర్ రవళి ఆశ వర్కర్లు,అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.