Thursday , May 23 2024

గెలిపిస్తే 100 కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తా.

పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల్లో ట్రస్టులు ఏర్పాటు.

పేద ప్రజల పిల్లలకు, పార్టీ కార్యకర్తలకు ట్రస్ట్ ద్వారా విద్యనందిస్తాం.

ట్రస్టు లోని డబ్బులు ఒక్క రూపాయి దుర్వినియోగమైన తల తీసేసుకుంటా.

మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సవాల్.

తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి మార్చి 31:

మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బరిలో తాను బి.ఆర్.ఎస్ పార్టీ నుండి పోటీ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తనకు అవకాశం ఇవ్వడం జరిగిందని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ సమీపంలోని మధుర గార్డెన్ లో మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాక సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2002 నుండి మెదక్ జిల్లాలోనే సుమారు 14 సంవత్సరాలు జిల్లా కలెక్టర్గ గా తాను విధులు నిర్వహించినట్లు తెలిపారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని నాయకులను కార్యకర్తలను వేడుకున్నారు. ఐఏఎస్ అధికారిగా 25 ఏళ్ల పాటు పనిచేయడం జరిగిందన్నారు. నా పనిని చూసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీ చేయడం జరిగిందన్నారు. తాను 2001 నుండి ఎమ్మెల్సీ విధుల్లో పనిచేయడం జరుగుతుందన్నారు. భగవంతుడు తనకు కలెక్టర్గా 25 ఏళ్ల పాటు పనిచేయడానికి ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేయడం జరిగిందన్నారు. నేడు ఎంపీ అభ్యర్థిగా కెసిఆర్ తనను నియమించడం జరిగింది అన్నారు. అందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు ఓట్లు వేసి రెండు లక్షల 50 వేలు ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన వేడుకున్నారు. తనను గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రాణం పోయినా సరే అభివృద్ధి పనులు చేసి చూపెడుతున్నారు. తాను గెలిచిన అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, స్థానిక నాయకులతో కలిసి చదువు కోసం పిల్లల భవిష్యత్తు కోసం 100 కోట్లు ఖర్చు పెడతారని ఆయన హామీ ఇచ్చారు. పేద ప్రజల పిల్లలకు, టిఆర్ఎస్ కార్యకర్తల పిల్లలకు ఉచితంగా చదువుతోపాటు వైద్య సేవలు అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. 100 కోట్ల వివరాలు వెబ్సైట్లో పెడతారని ఒక్క రూపాయి అందులో నుండి రాడు జరిగిన తాను ప్రాణం తీసుకుంటానన్నారు. గెలిచిన 9 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఫంక్షన్ హాల్ లను నిర్మిస్తారని హామీ ఇచ్చారు. అందులో పార్టీ కార్యకర్తలకు ఒక్క రూపాయితో ఫంక్షన్ చేసుకోవచ్చని అన్ని ఖర్చులు తానే భరించడం జరుగుతుందన్నారు. పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లను ప్రతి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తానన్నారు. తాను ఏమి చెప్పాను అదే పని తప్పకుండా చేసి పెడతారని అన్నారు. కేవలం 40 రోజులు మాత్రమే పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉందని ఓట్లు వేసి గెలిపించండి ఆయన ప్రాధేయపడ్డారు. తనను గెలిపిస్తే ఐదేళ్లపాటు అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ప్రత్యేకంగా మెదక్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలని రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వెంకటరామిరెడ్డిని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు ఎక్కడ అని టిఆర్ఎస్ జిల్లా పార్టీ నాయకురాలు,మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రైతుబంధు, గ్యాస్ సిలిండర్, కరెంటు కోతలు, గ్రామాల్లో తగినీటి సమస్య మొదలైందని ఆమె పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు 420 హామీలు ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఎక్కడ అన్నారు. ఈ హామీలు ఎక్కడ అని ఆమె ఎదవ చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భ్రమలో ఉన్నారన్నారు. కానీ ప్రజల గుండెల్లో టిఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు ఏమి హామీలు ఇచ్చారో వాటిని ముందుగా తీర్చాలని, గెలుపు ఓటములు సర్వసాధారణమన్నారు. పది సంవత్సరాలపాటు కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను బెదిరించడం, కేసులు పెట్టించడం, మానుకోవాలని ఆమె సూచించారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు దొందు దొందేనని ఆమె ఎదవ చేశారు. సమావేశంలో మెదక్ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు పట్లోళ్ల శశిధర్ రెడ్డి, అధికార ప్రతినిధి కాంటారెడ్డి తిరుపతిరెడ్డి, దేవేందర్ రెడ్డి, సరాఫ్ యాదగిరి, రామాయంపేట మున్సిపాలిటీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రామాయంపేట మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, రామాయంపేట మాజీ సర్పంచ్ పాతూరి ప్రభావతి, ఎంపీపీ బిక్షపతి, మండల మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.