Thursday , November 14 2024

శ్రీ నల్ల పోచమ్మ తల్లినీ దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్

తెలంగాణ కెరట కౌడిపల్లి ప్రతినిధి మార్చ్ 30

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని తునికి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ బండ్ల బోనాలు మహోత్సవానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తో కలిసి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం నీలం మధు ముదిరాజ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు ఇలాంటి పార్టీని ప్రజలు ఎల్లవేళలా ఆదరిస్తారని తెలిపారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువస్తుందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కొన్ని వర్గాలకే సంక్షేమ పథకాలు అందాయని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హతను బట్టి పథకాలు అందుతున్నాయని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో టీపిసీసీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రావు,కృష్ణ,ఎంపీపీ ధోతి సురేష్ నాయక్,ఎంపిటిసి పాషా,మాజి జెడ్పీటీసి శ్రీనివాస్ గుప్తా,స్ధానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.