Monday , September 16 2024

తునికి నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న సునీత లక్ష్మారెడ్డి

తెలంగాణ కెరాటం కౌడిపల్లి ప్రతినిధి మార్చ్ 31

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి మెదక్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు బిఆర్ఎస్ పార్టీకి గెలిచి చూపిస్తా అన్నారు. ఇంతకుముందు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన ప్రజలందరూ కలిసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా. అందరు కలిసి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను.ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మరియు నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కౌడిపల్లి బిఆర్ఎస్ నాయకులు సార రామా గౌడ్, పోచమ్మ డైరెక్టర్ ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.