Wednesday , September 18 2024

హోలీ సంబరాల్లో మునిగిపోయిన పలువురు యువకులు, చిన్నారులు.

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి (మార్చి 25):

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో సోమవారం హోలీ పండుగను పురస్కరించుకుని కులమతాలకు అతీతంగా చిన్నారులు, యువకులు ప్రతిఒక్కరు ఆనందంలో మునిగిపోయి హోలీ సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అందరూ రంగులు చల్లుకొని ఒకరికొకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.జీవితంలో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ హోలీ పండుగ మీ మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆనందంలో ప్రతి కుటుంబాలు రంగుల హరివిల్లుతో వేదజల్లాలని ఒకరికొకరు ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.