Wednesday , September 18 2024

భారతీయ జర్నలిజం పితామహుడి జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించాలి

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి మే 20

  • భారతదేశంలోనే మొట్టమొదటి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి •
  • కౌడిపల్లి మండల రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు•

మెదక్ జిల్లా కౌడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, రామానంద చటర్జీ గురించి చెప్పుకొచ్చారు, పశ్చిమ బెంగాల్ వాసి రామానంద చటర్జీ, భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్, పుట్టిన తేదీ: 29 మే 1865, పుట్టిన స్థలం బంకురా పశ్చిమ బెంగాల్ భారతదేశం, తల్లి హర సుందరి దేవి, తండ్రి శ్రీనాథ్ చటోపాధ్యాయ, పిల్లలు కేదార్ నాథ్ చటోపాధ్యాయ, చటర్జీ వృత్తి జర్నలిస్ట్ ఎడిటర్ ఆయన చదువుకున్న కళాశాల సెయింట్ జేవియర్స్ కళాశాల భారతదేశంలోని కోల్ కత్తాలో చదువు పూర్తి చేసుకొని కలకత్తాలో మొట్టమొదటిసారిగా (1907లో సం” ది మోడరన్ రివ్యూ,) అనే ఆంగ్ల పత్రికను తొలిసారిగా రచించి మీడియా రంగానికి వ్యవస్థాపకుడు, సంపాదకుడు, యజమాని అయ్యాడు ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం, భారతీయ జర్నలిజం పితామహుడు, అని అభివర్ణించారు, ఆ తర్వాత ఎన్నో పత్రికలను రచించి, భారత దేశ స్వాతంత్ర పోరాటంలోతన వంతు కృషి చేస్తూ ఎందరో మహానుభావులు భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణాలర్పించిన, స్వాతంత్ర సమరయోధుల గురించి ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూ వెలుగులోకి తీసుకువచ్చిన వ్యక్తి రామానంద చటర్జీ, ఆయన మరణించిన (తేదీ:30 సెప్టెంబర్ 1943,) ఆయన మరణించే నాటికి ఆయన వయస్సు 78 సంవత్సరాలు, ఆయన చనిపోయే చివరి వరకు జర్నలిజం లోనే పోరాడాడు, మనం కూడా జర్నలిజంలో ఉన్నాం అలాంటి గొప్ప వ్యక్తిని మనం తలుచుకుంటున్నాం, అతని జయంతి వర్ధంతి కార్యక్రమాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు ఏర్పాటుచేసిన సమావేశంలో ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు అలాగే అతని విగ్రహాన్ని కూడా హైదరాబాద్ నడిబొడ్డున స్వాతంత్ర సమరయోధులతో పాటు అతని విగ్రహాన్ని నిర్మిస్తే భారతదేశానికే అరుదైన గౌరవం దక్కుతుందని తెలియజేశారు.