Wednesday , July 24 2024

నర్సాపూర్ లో కెసిఆర్ బస్సు యాత్రని విజయవంతం చేయాలని

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి మే 8

మెదక్ జిల్లాకౌడిపల్లి మండల యువ నాయకులు పోల నవీన మే 8న మెదక్ జిల్లా నర్సాపూర్ కి విచ్చేయుచున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేకర్ రావుకి స్వాగతం పలికేందుకు కౌడిపల్లి మండల యువసేన అధ్యక్షులు పోల నవీన్ ఆధ్వర్యంలో మండల స్థాయి యువకులకు యువ నాయకులకు గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు, నర్సాపూర్ లో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కి తెలియజేశారు, ఈ సందర్భంగా పోల నవీన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కిందని అన్నారు, మే 13న జరిగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకొని కెసిఆర్ కి కానుకగా ఇచ్చి తెలంగాణని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు.