Saturday , October 12 2024

పోలియో చుక్కలు తప్పక వేయించాలి

(తెలంగాణ కెరటం) కొత్తూరు మండల ప్రతినిధి మార్చ్ 03

తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయం వద్ద పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు చుక్కలు వేశారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ••• ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.చుక్కల మందుతో పోలియో రహిత సమాజం నిర్మాణమవుతుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.