క బెల్ట్ షాప్ నిర్వాహకులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.
తెలంగాణ కెరటం కోహెడ ప్రతినిధి ఏప్రిల్ 19
సిద్దిపేట జిల్లా పరిధిలోని
కోహెడ మండలంలో గల రామచంద్రాపురం గ్రామంలో భీమగాని రంజిత్, తన ఇంటిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, కోహెడ పోలీసులు కలసి రైడ్ చేసి 20.140 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు
కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో గుణల కనకయ్య, ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తన ఇంటిలో బెల్ట్ షాపుపై నడుపుచున్నాడని సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులు రైడ్ చేసి 28.660 లీటర్ల బీర్లు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కోహెడ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు
ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మాట్లాడుతూ* ఇండ్లలో, హోటల్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, కిరాణా షాపులలో, ఇతర దుకాణాలలో ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా అక్రమంగా బెల్ట్ షాప్ నడిపితే, మరియు బహిరంగ ప్రదేశంలో కానీ ఇళ్లల్లో గానీ పేకాట ఆడితే సమాచారం అందించాలని కోరారు జూదం పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్, అక్రమ రవాణా చేసిన మరియు పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన కలిగి ఉన్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు