Wednesday , July 24 2024

కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా కొడంగల్ క్రైమ్ ప్రతినిధి ఫిబ్రవరి 18

ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సిసి రోడ్లు మెటీరియల్ తరలింపు చేస్తున్న టిప్పర్లు పోటాపోటీగా రోడ్లమీద అతివేగంగా నడుపుతున్నారు. ఈరోజు
కోడంగల్ మండలం చిట్లపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.టిప్పర్ వెనుక టైరు కింద పడి అదే గ్రామానికి చెందిన నర్సప్ప (60) దుర్మరణం.. రాత్రిపూట బెస్ట్ తరలిస్తున్న టిప్పర్లు పైన ఎలాంటి మ్యాట్ లేకుండా తరలించడంతో టిప్పర్ వెనకాల వెళుతున్న వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీనిమీద పోలీస్ సిబ్బంది దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.