రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ 28,600 తీసుకున్న మరోకేటుగాడు,
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,
నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రం లో రోజురోజుకు మోసగాళ్లు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు, మక్తల్ మండలాము భూత్పూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి కురువ కులానికి చెందిన గొర్ల కాపరి తాను ప్లాటు కొనాలని ఆకాంక్షతో గ్రామ మహిళా సంఘంలో కొంత డబ్బులు తీసుకొని తన గొర్రెలను కొన్ని అమ్ముకొని తెలిసిన వారితో , ప్లాటు కొనుగోలు చేయాలని అనుకుంటున్నా అని చెప్పడం జరిగింది,ఈ అమాయకత్వాన్నిఆసరాగా తెలుసుకున్న బొందల కుంట గ్రామానికి చెందిన డి సురేష్ తండ్రి వెంకటయ్య అను వ్యక్తి సర్వేనెంబర్ 239 ఆప్లాట్ నెంబర్ 80 విస్తీర్ణం 150 చదరపు గజాలు అని చందాపూర్ శివారులోహైటెక్ సిటీ కాలనీగా పేరు చెప్పి ఆరు లక్షల 80 వేల రూపాయలు తీసుకున్నాడు,అంతేకాకుండా సబ్ రిజిస్టర్ దగ్గరఉంటున్న దస్తావేజు రైటర్ సమ్మర్ అనే వ్యక్తి కి విషయం చెప్పి 28,600 ఇచ్చి రిజిస్ట్రేషన్ అంటూ ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి రెండు సంవత్సరాలుగా సదరు అశోకుని తిప్పుతూ ఉన్నారు,విసుకు చెందిన అశోక్ నేడు సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చితనకు ఇచ్చిన డాక్యుమెంట్ల ఈసీ కావాలని సదరు అధికారిని అడగగా సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది ఇది ఫేక్ డాక్యుమెంట్ ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్పడంతో సదరు అశోక్ లబోదిబోమంటూ సబ్ రిజిస్టర్ దగ్గర ఏడుస్తూ కనబడ్డాడు,విషయం తెలిసి మీడియా వివరణ కోరగా తన గోడను వెళ్ళబోసుకున్నాడు,మొత్తం మీదట మక్తల్ సబ రిజిస్టర్ కార్యాలయం అడ్డాగా ఇదంతా దందా కొనసాగుతుంది అనడానికి ఉదాహరణ నేడు దొరికిన డాక్యుమెంట్స్ అని చెప్పవచ్చు,ఇకనైనా అధికారులు స్పందించి బాధితులకి న్యాయం చేస్తారా లేక తమకేమీ పట్టనట్టు చూస్తూ ఊరుకుంటారా వేచి చూద్దాం‼️