Sunday , May 26 2024

విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ.

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 01

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని బుజరంపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ.. పఠన సామర్థ్యం పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరు శ్రద్ధతో చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు, పీసీసీ మైనారిటీ సెల్ కార్యదర్శి హకీం, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్ అలీ, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సయ్యద్ పాషా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్ సింగ్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల యన్ యస్ యు ఐ నాయకులూ నితీష్ కుమార్ విద్యా కమిటీ చైర్మన్ గాజుల శ్రీనివాస్, జిల్లా సేవాదళ్ కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు మల్లేష్, పర్వతాలు, మధుసుధన్ రెడ్డి, రమణ, భూమా గౌడ్, అల్తాఫ్, మహేందర్, నాయక్, రతన్, చక్రి, శంకర్, ముత్తు, సురేష్ పాల్గొన్నారు.