Thursday , May 23 2024

కౌడిపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన

కౌడిపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏల నిరసన

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 10 మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో వీఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలను సర్దుబాటు చేస్తూ ఇతర శాఖలకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టారు. వీఆర్ఏ వ్యవస్థను పాత పద్ధతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కోర్టు కూడా తప్పు పట్టిన నేపథ్యంలో కలెక్టర్లు పాత పద్ధతిని కొనసాగించి ఇతర శాఖలకు వెళ్లి ఉన్న వారిని వెనక్కి తీసుకోవాలని ధర్నా చేపట్టారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కౌడిపల్లి మండల్ కేంద్ర గ్రామం నుంచి వచ్చిన వీఆర్ఏలు నిరసన తెలిపారు.