Saturday , October 12 2024

కాశన్న యాదవ్ నో సన్మానించిన యాదవ సంఘం నేతలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం లోని యాదవులు ఆదివారం బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కాసన్న యాదవ్ ను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22 తారీకున అచ్చంపేటలో గురు వారం పెద్ద ఎత్తున యాదవ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశంలో అధిక సంఖ్యలో బైక్ ర్యాలీ మరియు డీజే చప్పుడులతో అచ్చంపేటలో దద్దరిల్లే విధంగా మన కాశన్న యాదవ్
ఆధ్వర్యంలో ఈ సన్నాక సమావేశంకి ముఖ్య అతిథులుగా మన తాలూకా శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ రాబోతున్నారని, కాబట్టి ఈ సమావేశానికి ప్రతి గ్రామాల నుండి అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా వరకు యాదవ కుటుంబ సభ్యులందరూ ఒకటి కావాల్సిన సమయం వచ్చిందని వారు పిలుపునిచ్చారు.