Monday , September 16 2024

కాషాయ పార్టీ లో వర్గ పోరు.. బండికి పదవికి గండం తప్పదా…!! సీనియర్లు చేస్తున్న కుట్రేనా .??!

కాషాయ పార్టీ లో వర్గ పోరు.. బండికి పదవికి గండం తప్పదా…!! సీనియర్లు చేస్తున్న కుట్రేనా .??!

వెంక గారి భూమయ్య సీనియర్ జర్నలిస్ట్ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ

ఎన్నికలు తలపిస్తున్న వేళ.. కాషాయ పార్టీలో కాక పుట్టిస్తున్న ముసలం.. బండి సంజయ్ పై ధర్మపురి అరవింద్, శేఖర్ రావు విమర్శ ల వెనుక సీనియర్ల కుట్ర ఏమైనా ఉందా..!! ఈటెల రాజేందర్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్ష పదవిపై కన్నేశార.. ఎన్నడు లేని విధంగా బండి సంజయ్ పై విమర్శలు చేయడం వెనుక మర్మమేంటి..!? తెలంగాణలో బిజెపి రావడం ఇష్టం లేకనేనా..!? ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నాయకులు విమర్శ చేయడం వెనుక అధికార పార్టీ కుట్రమైన ఉందా..?? బండి సంజయ్ పై జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. అమీషాకు ఫిర్యాదు చేసింది సీనియర్ నాయకులేనా!!? తెలంగాణలో పుంజుకుంటున్న వేళ నాయకులమధ్య ముసలమేంటి..!? బిజెపిలో చేరాలంటే కన్ఫ్యూజన్లో ఇతర పార్టీల నాయకులు ఉన్నారా..??

తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీలో బండి సంజయ్ వ్యాఖ్యలు తిరుగుబాటుకు దారితీస్తున్నాయా..!! బండి సంజయ్ పై తిరుగుబాటుకు సీనియర్లే సృష్టికర్తలా..!! బండి సంజయ్ చేసిన తప్పేంటి..!!? కల్వకుంట్ల కవితపై మాట జారడమే నేరమా…!! తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అంటే తెలియని పరిస్థితులలో మారుమూల పల్లెల నుండి పట్టణాల వరకు కాషాయ పార్టీ అంటే బండి సంజయ్ అనే స్థాయికి పెంచిన అతనిపై తిరుగుబాటు చేయడానికి కారణం..!? రాష్ట్రంలో బిజెపిని అభివృద్ధిలోకి తేవడమే నేరమా..!! ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులే విమర్శ చేయడం ఏంటి..? సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదని, బండి సంజయ్ వ్యవహార శైలి నచ్చడం లేదని ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నాయకులతో హై కామాండ్ కు ఫిర్యాదులు చేయిస్తున్నారని అనుమానాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. విద్యార్థి దశ నుండి పార్టీని నమ్మి బీజేపీకి వెన్నుదన్నుగా పనిచేస్తున్న రాష్ట్ర అధ్యక్షుల పై తిరుగుబాటు చేయడం పదవులను ఆశించే కొందరు నాయకులు కావాలనే చేస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేదు. ఇలా అయితే తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పదవి గండం తప్పదా..?? పొడిగిస్తారా..?? తొలగిస్తారా..?? బండి సంజయ్ కి హోం మంత్రి అమిత్ షా మద్దతు ఉంటుందా..!!? రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఎవరికి కన్ను పడింది..! సీనియర్లతో కలిసి బండి సంజయ్ పై ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నట్లు…. ఈటల రాజేందర్ కోసమా..? డీకే అరుణ కోసమా..? కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి కోసమా..?? కాషాయ పార్టీలో కాక పుట్టిస్తున్న.. ధర్మపురి అరవింద్ దేనికి సంకేతం..? ఈటెల రాజేందర్ కు సపోర్ట్ గానా లేక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అనుకూలమా..? తెలంగాణలో బిజెపి పుంజుకుంటున్న సమయంలో గ్రూపులు కట్టి పార్టీని దిగజార్చడం వలన.. ఆ పార్టీ లో చేరేది ఎవరు..?? రాష్ట్రంలో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ…. పార్టీలో అంతర్గత విషయాలను బజారుకీడ్చుకోవడం అధికార పార్టీకి అనుకూలమా.. వ్యతిరేకమా.. అని కార్యకర్తలను అయోమయంలోకి నెట్టే అవకాశం.. లేకపోలేదు..!! ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను ఎండగడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకవేళుతున్న బండి సంజయ్ పై సీనియర్లు అనుసరిస్తున్న వ్యవహార శైలి జాతీయ కమిటీ కూడా గమనిస్తుందని చెప్పాలి.. ఎన్నడు లేని విధానంగా తెలంగాణలో బిజెపి పుంజుకోవడం బండి సంజయ్..!! గతంలో పార్టీ అధ్యక్షునిగా పనిచేసినప్పుడు, అధికార పార్టీతో కుమ్ముకై పార్టీని బలోపేతం చేయకుండా అడ్డుకున్నారనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో బిజెపి అధికారం చేపట్టడం సీనియర్లకు ఇష్టం లేదేమో అని బిజెపి కార్యకర్తలు అగ్రహం వ్యక్తం తెలుస్తున్నా రు. బిజెపిలో కొందరు సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదని దీంతోనే ధర్మపురి అరవింద్, పెరాల శేఖర్ రావు వంటి కొందరు నాయకులు బాహాటంగానే బండిపై విమర్శలు చేయడంతో దీని వెనుక సీనియర్లే సృష్టికర్తలని, బిజెపి యువమోర్స నాయకులు, కార్యకర్తలు సీనియర్లపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో బండి సంజయ్ నే కొనసాగించాలని బిజెపి అనుబంధ శాఖల కార్యకర్తలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు, సీనియర్ నాయకులు , ఇతర పార్టీ నుండి వలస వచ్చిన కొందరు వ్యక్తుల స్వార్థంతో పార్టీ సర్వనాశనం చేసే కుట్ర జరుగుతుందని, అధికార పార్టీపై ప్రజావ్యతిరేకత వచ్చినప్పుడు కొన్ని మాటలు జారిపోతాయని వాటిని సాకు గా చూపి పార్టీ అధ్యక్షుల పై విమర్శలు చేయడం వల్ల పార్టీ కి ప్రయోజనం లేదని, అధికార పార్టీకి అనుకూల సంకేతాలు వెళ్తాయని, ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే బిజెపి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని బిజెపి కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సీనియర్ నాయకులు బండి సంజయ్ కి వ్యతిరేకంగా గ్రూపు కట్టారని.. బండి సంజయ్ కి మళ్ళీ అధ్యక్ష పదవి ఇవ్వద్దు అంటూనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ బండి లేకుంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని జాతీయ పార్టీ నాయకులు భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సీనియర్లు ఎన్ని అడ్డంకులు వేసిన బండి సంజయ్ కి మళ్ళీ అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం కూడా సాగుతుంది. ఇతర పార్టీ నుండి వచ్చిన నాయకుల పీర్యాదులు, మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు అని జాతీయ పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా ఉన్నారని తెలుస్తుంది. పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని ఇతర పార్టీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా వ్యవహరించకూడదని అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో బండి సంజయ్ కి పదవి గండం ఉన్నదా..!! సీనియర్లు ఏమైనా అడ్డుకట్ట వేస్తారా..?? కొనసాగుతారా..?అధిష్టానం బండికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా..?? లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి సమయంలో బిజెపి పార్టీలో అల్లకల్లోలనికి కారణమైన నాయకులపై చర్యలను తీసుకుంటారా..?? భుజగిస్తారా.. అనేది ప్రశ్నార్థకంగా మిగులుతుందా..!? అదీ వేచి చూడాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *