Tuesday , July 16 2024

కలెక్టర్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ కెరటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో ఆగష్టా 6

కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాదుతు.  ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటు కు అంకితం చేసిన వ్యక్తి అని  కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్, ప్రతినిధులు దేవరాజ్, శ్రీనివాస్ రెడ్డి, జుగల్ కిషోర్, లక్ష్మణ్, సాయిలు పాల్గొన్నారు.