Sunday , May 26 2024

కంపు కొడుతున్న ఆలయ వసతిగదుల పరిసరాలు.?

నాలాలకు తలుపులే దిక్కు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్ :-14

తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి పార్వతీపురం వసతి గదుల సముదాయముల వద్ద పరిసరాలు కంపు కొడుతున్నాయి సానిటేషన్ లో పనిచేసే కార్మికులను ఇండ్లలో పెట్టి చాకిరికి ఉపయోగించుకునే ఈ అధికారి కి పార్వతిపురం వసతి గదుల సముదాయం టిటిడి ధర్మశాల లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ల వద్ద మురికి కాలువలు మొత్తం చెత్త చెదారంతో నిండి పరిసర ప్రాంతాలు కంపు

కొడుతున్నాయి ఈ దుర్గంధం వల్ల దర్శనానికి వచ్చి వసతి గదులలో గది అద్దెకు తీసుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్టి నాళాలు వాసన రాకుండా శుభ్రం చేయడం మరిచి వాటిపై తలుపులు పెట్టి తమ పనితనం చూపెడుతున్నారు శానిటేషన్ పై అవగాహన లేని వ్యక్తి పర్యవేక్షకుడిగా నియమించడంతో కిందిస్థాయి సిబ్బంది ని తరచూ వేదిస్తూ దుర్భాషలాడుతూ వార్తల్లో కి ఎక్కాడు కానీ అధికారి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దర్శనానికి వచ్చి వసతి గదుల లో ఉండు భక్తులకు ఇబ్బంది కలగకుండా
మురికి కాలువలు శుభ్రపరచి
వాటిపై మూతలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సానిటేషన్ పర్యవేక్షక అధికారిని శాఖ నుంచి తొలగించి అవగాహన కలిగిన అధికారిని
నియమించవలసిన
అవసరం ఎంతయినా ఉంది