తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 17:
తెలంగాణా జాతి పిత మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌ.శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి 70వ జన్మదినం సందర్భంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్ ఆవరణలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బి ఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు యంకె ముజీబోద్దీన్ గార్ల అధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గం నలుమూలల నుండి వచ్చిన జెడ్పిటిసి లు, ఎంపీపీ లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల & పట్టణ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ లు, సొసైటీ చైర్మన్ లు, మాజీ సర్పంచ్ లు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం, మహిళా విభాగం మరియు అభిమానుల సమక్షంలో ఉదయం 12 గంటలకు భారీ కేక్ కటింగ్, అనంతరం 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, రైల్వే బ్రిడ్జి, నిజాంసాగర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ తీశారు.
ఇట్టి కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణు గోపాల్ రావు, జెడ్పి వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్, లోయలపల్లి నర్సింగరావు, పిప్పిరి ఆంజనేయులు, మిన్కూర్ రాంరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బి ఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గైని శ్రీనివాస్ గౌడ్, గెరిగంటి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొని కెసిఆర్ గారి జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.
ఇట్లు
గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ
47వ వార్డు కౌన్సిలర్