Wednesday , July 24 2024

కామారెడ్డిలో ఫ్లెక్సీల లొల్లి

ఓ వివాదం మరువక ముందే మరో వివాదం

ఒకదాంట్లో గొర్రెలు, ఒకదాంట్లో రైతు బీమా

తెలంగాణ కెరటం ఉమ్మడి నిజాంబాద్ జిల్లా బ్యూరో జూలై 17

కామారెడ్డి జిల్లాలో వెలసిన ఫ్లెక్సీలలో కొన్నిచోట్ల కురుమ గొల్ల లేనిచోట్ల గొర్రెల పంపిణీ జరిగినట్లు, మరో దాంట్లో రైతులకు రైతు బీమా ఇవ్వకుండా ఇచ్చినట్లు రావడంతో దీనిని ఆసరా చేసుకొని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. వీటి విషయాలు ప్రజలు మర్చిపోకముందే బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సహృదయ దాత ఎవరి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకునే వ్యక్తి తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీలో కనిపించద్దు అంటూ బీబీపేట మండల బిఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చినట్లు ఒక దిన పత్రికలో ప్రచారం కావడంతో కామారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ లో ఏమి జరుగుతుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. దోమకొండ మండలానికి చెందిన జెడ్ పి టి సి తిరుమల్ గౌడ్ సీతారాంపూర్, సీతారాంపల్లి గ్రామాల పేర్లు దగ్గరి పోలికలు ఉండటం వల్ల పొరపాటు జరిగిందని చెప్పి చెప్పగానే రైతు బీమా విషయం బయటకు వచ్చింది. ఈ విషయాలను ప్రజలు మర్చిపోకముందే తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి ఫోటో ఎక్కడ ఫ్లెక్సీలో కనపడద్దంటూ, బి ఆర్ ఎస కార్యకర్తలు ఎవరు అతని ఇంటి గడప తొక్కొద్దంటూ అతను టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదని జిల్లా అధ్యక్షుడు హుకుం జారీ చేయడంతో బిబిపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు తాము సుభాష్ రెడ్డి వల్లనే బిఆర్ఎస్ లోకి వచ్చామని తము సుభాష్ రెడ్డి నీడలోనే ఆయనకు తోడునీడగా ఉంటామని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో సుభాష్ రెడ్డి ఎవరు వైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పటినుండే చర్చనీయాంశంగా మారింది. సుభాష్ రెడ్డి సేవలు కేవలం బిబిపేట మండలానికి పరిమితం కాలేదు, భిక్కనూర్, మాచారెడ్డి తదితర మండలాలకు సైతం ఆయన సేవలు అందించారు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తిని పార్టీకి దూరం చేసుకోవడం అంటే పార్టీకి ఓట్ల రూపంలో పెద్దగా నష్టం వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గంప గోవర్ధన్ కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి సుభాష్ రెడ్డి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సైతం ఆయన గెలుపుకు కృషి చేశారు. బిబిపేట మండలంలో ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగిన జనగామలోని సుభాష్ రెడ్డి ఇంటిలోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు కొనసాగాయి. అలాంటి వ్యక్తిని పార్టీకి దూరంగా ఉంచడం అంటే తమగోయి తామే తవుకున్నట్లు అవుతుందని వివిధ మండలాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
సుభాష్ రెడ్డి బిబిపెట్ మండలానికి వచ్చారంటే జనగామ లోని ఆయన ఇంటి వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది, గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, నాయకులు ఆయన ఇంటి వద్ద ఉంటారు.