Wednesday , September 18 2024

సీజింగ్ వాహనాలు కొనేటప్పుడు కొనుగోలుదారులు జాగ్రత్త వహించాలి

  • డి.టి.ఓ. శ్రీనివాస్ రెడ్డి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 14 (తెలంగాణ కెరటం)

జిల్లా కేంద్రంలో ఎవరైనా ఫైనాన్సర్ వద్ద సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనాలనుకున్నట్లయితే ఫైనాన్సర్ ఆ వాహనాన్ని మీ పేరుపై బదలాయించిన తర్వాతనే అతనికి డబ్బులు చెల్లించాలని అలాగే ఎవరైనా ఫైనాన్స్ కట్టని యెడల అట్టి వాహనాన్ని రవాణా శాఖ వారు చట్ట ప్రకారం ఫైనాన్స్ పేరున బదలాయిస్తారు. కాబట్టి మీరు వాహనాన్ని కొనేటప్పుడు ఆ వాహనం యొక్క ఆర్.సి. ఫైనాన్సర్ పేరుపైన ఉందా లేదా అని పరిశీలించి ఆ తర్వాతనే ఆ వాహనాలను కొనాలని డిటిఓ శ్రీనివాస్ రెడ్డి సూచించారు.