Wednesday , July 24 2024

లోక్ సభ ఎన్నికలకు సర్వం ఏర్పాటు చేస్తున్న సిబ్బంది.

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 13:

సోమవారం లోక సభకు జరగబోయే పోలింగ్ కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
జిల్లాలో 6,80,921 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని, ఇందుకోసం 791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 64 సమస్యాత్మక లొకేషన్లను గుర్తించి 64 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడీ లలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఆదివారం పోలింగ్ బృందాలు ఈవీఎం లు, పోలింగ్ సామాగ్రితో ఆయా నియోజక వర్గాలలోని పోలింగ్ కేంద్రాలకు నిర్దేశించిన రూట్లలో తరలి వెళ్లారని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి లో 27 రూట్ల ద్వారా 27 బస్సులలో, జుక్కల్ లో 26 రూట్ల ద్వారా , యెల్లారెడ్డి లో 29 రూట్ల ద్వారా బస్సులలో పోలింగ్ బృందాలు తరలివెళ్లాయని అన్నారు. నేటి రాత్రికే పోలింగ్ కేంద్రాలలో సరిగ్గా వెలుతురూ ఉండేలా కంపార్ట్మెంట్, సీటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏ చిన్న సంఘటనకు తావివ్వకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు . పోలింగ్ అనంతరం చెక్ లిస్ట్ ప్రకారం ఈవీఎం లను, ఇతర మెటీరియల్స్ ను రిసిప్షన్ కేంద్రాలలో అప్పగించాలని , వాటిని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని అధికారులకు సూచించారు.
ఓటింగ్ జరిగే రోజు సెలవు దినం కాదని మనందరి ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఒక అపూర్వమైన రోజు అని ప్రతి ఒక్కరు గుర్తెరిగి బాధ్యతాయుతంగా వంద శాతం ఓటు వేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని తద్వారా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గానికి జరగనున్న పోలింగ్ కు ఓటర్లు తమ ఓటరు కార్డు లేదా ఎన్నికల సంఘం సంఘం సూచించన 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి వెంట తేవాలని, మొబైల్స్ అనుమతి లేదని స్పష్టం చేశారు. జిల్లాలో516 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా నియోజక వర్గం వారీగా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తగు ఆదేశిల్సేతామని కలెక్టర్ తెలిపారు.