తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 13:
భిక్కనూర్ మండలం తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మమేకమయ్యారు. అకాల వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని ఇన్చార్జిని ఆదేశించారు. తిప్పాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 2 లారీలను సమకూర్చాలని ట్రాన్స్ఫర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. పాల్వంచ మండలం పరిది పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికంగా ధాన్యం కుప్పలు ఉన్నందున 10 లారీలను పంపించాలని సూచించారు. మాచారెడ్డి మండలం లచ్చపేట కొనుగోలు కేంద్రంలో 900 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని పంపేందుకు లారీని ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు ఉంచాలని కోరారు. పల్వాంచ మండలం పరిధిపేటలోని సాయి మణికంఠ రైస్ మిల్లును సందర్శించారు. రైస్ మిల్ యజమానితో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అన్లోడ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నిత్యానందం, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్లు కిష్టయ్య, శ్రీనివాస్, సహకార సంఘాల కార్య నిర్వహణ అధికారులు పాల్గొన్నారు.