తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 5:
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి ఆర్ డి ఓ కార్యాలయం, మద్నూరు, ఎల్లారెడ్డి తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. జిల్లాలో 4,546 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలీస్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొనుటకు వీలుగా ప్రతి నియోజక వర్గంలో ఒక ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా శని ఆదివారాలలో పిఓలు పోలీస్ అధికారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇతర పోలింగ్ సిబ్బంది మాత్రం సోమ మంగళవారాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆయా నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్ కేంద్రాలలో వినియోగించుకోవలసిందిగా కలెక్టర్ సూచించారు.