Sunday , May 26 2024

కామారెడ్డి బల్దియా అప్పు 40కోట్లు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధిమార్చి 07:

పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదు,ఇకపై కామారెడ్డి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరు కౌన్సిలర్ కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు.అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ముందుకు సాగుతాం.ఆదాయ మార్గం పెంచుకొని కామారెడ్డి ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతాం.శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డికామారెడ్డి పట్టణం మున్సిపల్ సర్వ సభ్య సమావేశనికి హాజరై, సమావేశం అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట విలేకరులతో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి దారుణంగా ఉందని, బల్దియా అప్పు 40కోట్లు అని, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదనీ అన్నారు. ఇలాగే కొనసాగితే వీధి దీపాల బిల్లులు చెల్లించడం కూడా కష్టం అని అన్నారు. నేటి సమావేశంలో అందరూ కౌన్సిలర్ ల సమక్షంలో అభివృద్ధి గురించి చర్చించామని, ఇకపై కామారెడ్డి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరు కౌన్సిలర్ కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారనీ అన్నారు. అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ముందుకు సాగుతాం అని అన్నారు. ఆదాయ మార్గం పెంచుకొని కామారెడ్డి ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని ఆశా భావం వ్యక్తం చేశారు.