Sunday , May 26 2024

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసినదిగా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 5:

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఆదివారం గాంధారి మండలంలోని గుర్జల్, బ్రాహ్మణపల్లి, గాంధారి లలో కొనుగోలు కేంద్రాలను ,గాంధారి లో పంచ కృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి, కేంద్రాల్లో వసతులు, డబ్బు చెల్లింపుపట్ల రైతులను ఆరా తీయగా వసతులు బాగున్నాయని , కొనుగోలు జరిగిన మూడు రోజులలోగా డబ్బులు మా ఖాతాలో పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాలలో రైతులకు నీడ, మంచినీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాబోయే మూడు రోజులలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కేంద్ర నిర్వాహకులు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాత్రి పొద్దు పోయాక కూడా ధాన్యం కొనుగోలు చేస్తూ ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా వెంటనే ధాన్యం అన్ లోడ్ చేసుకొని తిరిగి లారీలను పంపే విధంగా మానిటరింగ్ చేస్తూ వెంటవెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి 48 గంటలలోగా రైతులఖాతాలో డబ్బులు జమచేసేలా చూడాలన్నారు.
రైస్ మిల్లర్లు హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకొని మిల్లులకు లారీలు వచ్చిన వెంటనే అన్ లోడ్ చేసుకొని ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు 2023= 24 ఖరీఫ్ కు సంబంధించిన సి ఎం ఆర్ బియ్యాన్ని మిల్లు సామర్థ్యం మేరకు మరాడించి నిర్దేశించిన గడువులోగా భారత ఆహార సంస్థకు చేరవేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల డిప్యూటీ తహసీదారులు తదితరులు పాల్గొన్నారు.