Sunday , May 26 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 4:

శనివారం ఆర్.డి.ఓ. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని సందర్శించి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను,ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్న ఉద్యోగులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండాఓటింగ్ ప్రక్రియ సజావుగా , సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జాగ్రత్త నిర్వహించాలని అధికారులకు తగు సూచనలు చేశారు. మైక్రో అబ్జర్వర్లు ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలన జరపాలని అన్నారు. జిల్లాలో 4,546 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలిష్ అధికారులు, ఉత్తర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొనుటకు వీలుగా ప్రతి నియోజక వర్గంలో ఒక ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. జుక్కల్ నియోజక వర్గానికి సంబంధించి మద్నూర్ తహశీల్ధార్ కార్యాలయంలో, ఎల్లారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఎల్లారెడ్డి తహసీల్ధార్ కార్యాలయంలో, కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఆర్డీ ఓ కార్యాలయంలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 4,5 తేదీలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్,పొలిసు అధికారులు, 6,7 తేదీలలో ఇతర పోలింగ్ సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. మొత్తంగా శనివారం నుండి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ రావు, తహసీల్ధార్ జనార్దన్, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.