Sunday , May 26 2024

ఎన్నికల కమీషన్ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్

అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఛానళ్లలో ప్రసారాలకు, ప్రింట్ మీడియా లో ప్రకటనలకు సంబంధించి ముందస్తుగా అనుమతి పొందకుండా ప్రచురించడం, ప్రసారం చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కు వస్తుందని, అట్టి ఖర్చును అభ్యర్థి పేర చూపించడం జరుగుతుందని అన్నారు. . అభ్యర్థి పేర వారి అనుచరులు ఖర్చు చేసిన అట్టి ఖర్చు అభ్యర్థి ఖాతాలో చూయించడం జరుగుతుందని, ఒక వేళ అభ్యర్థి సమ్మతించకుంటే పబ్లిషర్ పై చర్య తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రకటనలకు సంబంధించిన స్క్రిప్ట్, వీడియో, ఖర్చు, తదితర వివరాలను నిర్ణీత దరఖాస్తు ఫారం వెంట సమర్పించాలని, వాటిని పరిశిలించి ఏం.సి.ఏం.సి. కమిటీ ఆమోదం తెలుపుతుందని అన్నారు. సామాజిక మాధ్యమాలలో బల్క్ ఎస్.ఏం.ఎస్. లు, వాయిస్ మెసేజిలు, సినిమా హాళ్లలో , రేడియోలలో ప్రకటనలకు సంబంధించి ముందస్తుగా అనుమతి పొందాలని సూచించారు. అదేవిధంగా నిబంధనలననుసరించి ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించేటప్పుడు తప్పని సరిగా అనుమతి పొందాలని సూచించారు. వాటిపై ప్రింటర్, ప్రచురణ కర్త పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్,, ప్రతుల సంఖ్య తో పాటు ప్రింటింగ్ చార్జీల వివరాలను , ముద్రితమైన ప్రచార సామగ్రి, పబ్లిషర్ ఇచ్చిన డిక్లరేషన్ కాపీని సమర్పించాలని సూచించారు.
అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వచ్చిన మెస్సేజ్ లో వాస్తవం గ్రహించి నిర్దారణ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కు 2 రోజుల ముందు సైలెన్స్ పీరియడ్ చాలా కీలకమని న్యూస్ రిపోర్టింగ్ లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు,అధికారులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్దిష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు నడుచుకోవాలన్నారు. సభలు, సమావేశాలకు, లౌడ్ స్పీకర్ లకు, వాహనాలకు ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని, సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎన్నికలకు సంబంధించి ఏదేని సమాచారం కొరకు 1950 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు.