Sunday , May 26 2024

ఆదివారం జిల్లాకు వచ్చిన జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ పోలీసు పరిశీలకులు రాజేష్ మీనా ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు,
అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లు, జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల వద్ద విస్తృత వాహన తనకీలు ,ఎఫ్.ఏస్.టి, ఎస్ఎస్ టి బృందాల ద్వారా నిర్వహిస్తున్న
తనఖి ,పట్టుబడిన నగదు, పోలీసు, అబ్కారీ శాఖల ఆధ్వర్యంలో మద్యం, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్న మద్యం, నమోదు చేసిన కేసుల వివరాలను వారికి వివరించారు. జిల్లాలో గుర్తించిన సమసాత్మక పోలింగ్ కేంద్రాలు, లొకేషన్ లలో తీసుకుంటున్న పోలీసు బందోబస్తు, శాంతి భద్రతలకు విఘాతం కలగ కుండా ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సుహృద్భావ వాతావరణం కల్పించుటకు తీసుకుంటున్న చర్యలను పరిశీలకులకు వివరించారు.
.