Sunday , May 26 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

కామరెడ్డి పట్టణంలోని రాజారెడ్డి కల్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశనీ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ లు హాజరయ్యారు. కామారెడ్డి పట్టణం లోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 850 మంది షబ్బీర్ అలీ , సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరరు, కాంగ్రెస్ పార్టీలో చేరినవారికి షబ్బీర్ అలీ , సురేష్ శెట్కార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు.