Wednesday , September 18 2024

బిజెపికి తమ ఓట్లు

  • తీర్మానం చేసిన సదాశివనగర్ మండల కేంద్ర ముదిరాజులు
  • కృతజ్ఞతలు తెలిపిన బిబి పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 28:

జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన ముదిరాజులు తమ కులానికి చెందిన ఓట్లన్నీ బిజెపి పార్టీకే వేస్తామని తీర్మానం చేసినట్లు ఆదివారం జహీరాబాద్ తాజా మాజీ ఎంపీ, బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ కు తెలిపారు. ఈ సందర్భంగా అభిషేక్ పాటిల్ మాట్లాడుతూ తన తండ్రి సేవలను గుర్తించుకొని తన తండ్రి సేవలను గుర్తించుకొని తిరిగి తన తండ్రిని ఎంపీగా గెలిపిస్తామని తమ ఓట్లన్నీ బిజెపి పార్టీకి వేస్తామని చెప్పిన ముదిరాజ్ కులస్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. తన తండ్రి రాజకీయంలో ఎదుగుతున్న తీరును చూసి ఎదగలేక కొందరు ఏమి మాట్లాడాలో తెలియక అబండాలు వేస్తున్నారన్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురా వచ్చారన్నారు. రోడ్లు విస్తరించారని అవి బీబీ పాటిల్ చేశారని చెప్పకుండా ప్రతిపక్షాలు వక్రీకరిస్తూ మాట్లాడుతున్నారని, బీబీ పాటిల్ గత పది సంవత్సరాలుగా ఎంత అభివృద్ధి చేశారో అన్నిటికీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అనంతరం మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ గుప్తా మాట్లాడుతూ
మోడీకి మనం ఇప్పుడు వేసే ఓటు కృతజ్ఞత ఓటు అన్నారు. ఆయన దేశ ప్రజల కల అయినటువంటి రామా మందిర నిర్మాణాన్ని 25 మంది లాయర్లతో సుప్రీంకోర్టులో కేసును గెలిచి రామ మందిర నిర్మాణాన్ని చేపట్టారని అందుగాను మోడీకి ఇప్పుడు వేసే ఓటు కృతజ్ఞత ఓటుగా వేద్దామన్నారు.
సదాశివ నగర్ ముదిరాజుల కుల సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని మరిన్ని కుల సంఘాలు బిజెపికి ఓట్లు వేస్తామని దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. అయోధ్య నిర్మాణం మన దేశ ప్రజలకు కలగానే ఉండేదని మోడీ వచ్చి ఆ కలను నిజం చేశారన్నారు. భారతదేశం నేడు ఆర్థికంగా ఐదవ స్థానంలో ఉందని ఇదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మరొకసారి ఎన్నికైతే భారతదేశం ఆర్థికంగా బలపడుతుందన్నారు. కరోనా సమయంలో బీబీ పాటిల్ ఎంతోమంది పేదలను, బాటసారులను ఆదుకున్నారన్నారు. కరోనా సమయంలో కొందరికి వ్యక్తిగతంగా సైతం ఆస్పత్రులకు ఆర్థిక సహాయం అందించారన్నారు. నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధానిగా చూడాలని ప్రతి ఒక్కరం ఆ దిశగా కృషి చేయాలన్నారు. అమెరికా పార్లమెంటులో మాట్లాడిన భారత ప్రధాని ఒకే ఒకరు మోడీ అన్నారు. ప్రపంచమే మోడీని గుర్తిస్తుంది అలాంటి మోడీని దేశ ప్రజలు గుర్తించాలనీ, ఈ తీర్మానాలు కేవలం కొన్ని గ్రామాలకే పరిమితం కాకుండా అన్ని గ్రామాలలో ఈ తీర్మానాలు చేసి బిజెపి విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ, ఒక్కొక్క ఓటు కోట్ల ఓట్లు కావాలి అన్నారు. జయ రాబాద్ పార్లమెంటు స్థానం నుండి బిజెపి పార్టీ పువ్వు గుర్తుపై ఓట్లు వేసి బీబీ పార్టీలను అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.