Thursday , May 23 2024

అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద మంజారైన పనులను జూన్ 10 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19:

శుక్రవారం రాజంపేట మండలం లోని ఆరెపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఆరెపల్లి తండా పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో గ్రామా సమాఖ్యల ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పాఠశాలలో త్రాగు నీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులు, చిన్న చిన్న మర్మమతులను చేపట్టి పూర్తిచేయాలని పాఠశా ప్రధానోపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ సుష్మాపై రెడ్డి, ఏఈ ఆనందం, ఎంఈఓ రామస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు లత, తదితరులు పాల్గొన్నారు.