Wednesday , July 24 2024

కెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది.కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న :బిఆర్ఎస్ పార్టి:

తెలంగాణ
రాజకీయం
కెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది.కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న :బిఆర్ఎస్ పార్టి:

కెసిఆర్ పోటీ చేసిన కామారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీ బీఆర్ఎస్ చేజారింది.

కామారెడ్డిలో మనుగడ కోల్పోతున్న బిఆర్ఎస్ పార్టి

కొత్త ఇంచార్జి చైర్ పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందు ప్రియా

కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మార్చి

కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.
దీంతో ఆమె చైర్మన్ పదవిని కోల్పోయారు. కొత్త ఇంఛార్జి చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి సహకరించారు.49 మంది కౌన్సిలర్లకు గాను 27 మంది అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. ఇందులో 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారు వెళ్లిపోగా బీఆర్ఎస్‌కు 16 మంది ఉన్నారు. బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరు కాలేదు. అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
అంతకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ని కలిసిన మున్సిపల్ కౌన్సిలర్లు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
పదవిని దుర్వినియోగం చేస్తూ అనేక అవినీతి అక్రమాలు చేశారని చాలా సార్లు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. సొంత పార్టీ కౌన్సిలర్లు సైతం వీరి ఆగడాలపై వారి ఆదిష్టానికి ఫిర్యాదు కూడా చేశారు . ఒక దశలో చైర్‌పర్సన్‌ను మార్చాల్సిందేనని పట్టుబట్టారు.
ఇకపై కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత పాలన అందిస్తుంది.
భూ కబ్జాలు ఇంటి పర్మిషన్లకు లంచాలు లేకుండా అందరికీ ఒకేలా పాలన అందిస్తుంది
గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టారు.అవినీతితో నిండిపోయి బిఆర్ఎస్ పార్టీ కంపు కొడుతుంది
కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డి తో సమావేశమై కామారెడ్డి అభివృద్ధికి 50 కోట్ల విడుదల చేయాలని కోరారు దీనితో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు
కెసిఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో అనావృష్టి వల్ల ఆరుసార్లు పంట నష్టపోతే ఒక్కసారి కూడా పంట నష్టపరిహారం అందించలేదు కనీసం వారిని పరామర్శించిన పాపాన పోలేదు.కెసిఆర్ వేల కోట్ల అవినీతితో మేడిగడ్డ కృంగిపోయింది పంటలకు నీరు అందుతాయి అన్న రైతుల ఆశలు సన్నగిల్లాయి లిక్కర్ కుంభకోణంలో కూతురు కవిత జైలుకెళ్ళింది
భూ కబ్జాలతో సంతోష్ రావు కన్నారావు
ఫోన్ ట్యపింగ్ కేసులో కేటీఆర్ జైలుకుపోయే రోజులు దగ్గరపడ్డాయి
ఇక మీరు వెళ్లాల్సింది ప్రజల వద్దకు కాదు జైలుకే
అకాల వర్షాలు, వడగళ్ళు కు పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పినం రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దుని అండగా నిలబడ్డం
రాష్ట్రం మొత్తంలో నష్టం జరిగిన నివేదిక అందింది త్వరలో రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించింది రైతుల పంట బీమా రుసుము కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన ఆరు పథకాలను అమలు చేస్తుంది అందులో భాగంగా ఐదు పథకాలు ఇప్పటికే అమలు చేసింది.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.