Tuesday , July 16 2024

ఘనంగా జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షుని జన్మదిన వేడుకలు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 11:

జై గౌడ ఉద్యమం కామారెడ్డి
జిల్లా అధ్యక్షులు మురళి గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండలం మండలం ఎర్ర పహాడ్ గ్రామంలోని ఆయన నివాసంలో పూల మాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం గౌడ కులస్తుల నడుమ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చీ ఆనందోత్సవాల మధ్య జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు గౌడ అభ్యున్నతి కోసం మురళి గౌడ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో
జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బొంబోతుల లింగా గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, జై గౌడ ఉద్యమం జిల్లా నాయకులు అంకన్న గారి నాగరాజ్ గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, కరోల శేఖర్ గౌడ్, పెద మల్లారెడ్డి సుదర్శన్ గౌడ్, , సుక్క రవి గౌడ్, అడ్లూరు ఎల్లారెడ్డి లక్ష్మీపతి ,మార్కల్ బాగన్న,రాయుడు మహేష్ గౌడ్, సుమిత్ గౌడ్, కోనాపూర్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.