Saturday , October 5 2024

దోమకొండ కల్లు దుకాణం లో కల్లు సేవించి ఒకరి మృతి. కామారెడ్డి.

దోమకొండ కల్లు దుకాణం లో కల్లు సేవించి ఒకరి మృతి. కామారెడ్డి.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో జోరుగా కల్తీకల్లు విక్రయాలు కొనసాగిస్తున్నారు దీంతో యువత కల్తీ కల్లు తాగి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు మండల కేంద్రానికి చెందిన కామినేని ధీరజ్ (37) కల్తీ కల్లు తాగి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ధీరజ్ అనే యువకుడు రోజు మాదిరిగానే హౌస్ వైరింగ్ చేసి పనులు ముగించుకొని సాయంత్రం ఎల్లమ్మ గుడి వద్ద కల్లు సేవించి మృతి చెందాడు. ఆదివారం రాత్రి మృతి చెందితే కల్లు డిపోకు ముస్తేదారులు తాళం వేసుకుని వెళ్లి సోమవారం ఉదయం వచ్చి డిపో తాళం తీసే సరికి మృతి చెందిన ధీరజ్ ను చూసి శవాన్ని హుటా హుటిన పోస్టుమార్టంకి కామారెడ్డి తరలించారు . గ్రామస్తుల తెలిపిన ప్రకారం దోమకొండ మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా కల్తీకల్లు విక్రయాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.ధీరజ్ మృతి పై తమకు అనుమానాలు ఉన్నాయని స్థానిక ఎస్ ఐ.సుధాకర్ కు కుటుంబీకులు ఫిర్యాదు చేసినట్లు దోమకొండ ఎస్ ఐ సుధాకర్ తెలిపారు. గ్రామసులతోపాటు ,మృతుని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు .కల్తీకల్లుతో యువత బలైపోతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకొని పేద ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు అధికారులను కోరారు

. గత ఆరు నెలల నుండి ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లుకు ఆరుగురు యువకులు మరణించిన సంఘటనలు ఉన్నాయి కామారెడ్డి రూరల్ గ్రామాలలో కల్తీకల్లు ఒకరికి మించి ఒకరు డోసు పెంచి యువతను చిత్తు చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని యువత ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు కాగా దోమకొండ మండల కేంద్రంలో మండలంలో రెండు(2) దుకాణాలకు మాత్రమే మాత్రమే లైసెన్సులు ఉన్నా మండల కేంద్రం లో (8) దుకాణాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యువకునికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.