Sunday , May 26 2024

కేడీసీసీ బ్యాంకులో దోపిడీకి దొంగల యత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
జూన్:-19

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫల యత్నం చేశారు


కేడీసీసీ బ్యాంకు వద్ద నిర్మాణం పనులు జరుగుతున్నాయి దానికోసం బస్టాండు వైపు తూర్పు దిక్కున కట్టిన పలాంచ ద్వారా రెండువ అంతస్తులో ఉన్న కెడిసిసి బ్యాంకు లోనికి అల్యూమినియం స్లయిడింగ్ విండో నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు మొదట బ్యాంకు లోని సి సి కెమెరాలకు సంబంధించిన కేబుల్ ను కట్ చేశారు అనంతరం బ్యాంకు లోపల ఉన్న రెండు సెంటర్ల ను ఇనుప రాడ్ సాయంతో పైకి ఎత్తి లాకర్ వద్దకు వెళ్లి లాకర్ను ఇనుప రాడ్ సాయంతో విప్పే ప్రయత్నం చేశారు తెరుచుకోక పోవడం తో విఫలమై దొంగలు బ్యాంకు లోని పైల్లను చిందరవందర చేసి పారిపోయారు సోమవారం ఉదయం తాత్కాలిక వాచ్మెన్ అనిల్ ప్రతిరోజు లాగా వచ్చి బ్యాంకును శుభ్రం చేస్తుండగా చిందరవందరగా పడి ఉన్న ఫైళ్లను లాకర్ ను పరిశీలించి చూడగా దొంగలు బ్యాంకు దోపిడీ కి యత్నించినట్లు గమనించి వెంటనే బ్యాంకు మేనేజర్ సంపూర్ణకు సమాచారం అందించాడు అప్పటికి మేనేజర్ సంపూర్ణ బ్యాంకు లో దోపిడీ యత్నం సమాచారాన్ని ఎల్లారెడ్డిపేట ఎస్ ఐ ప్రేమ్ దీప్ కు సమాచారం అందించడం తో హుటాహుటిన ఎస్ఐ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు


అనంతరం డాగ్స్ స్కాడ్ ఇంచార్జీ శ్రీనివాస్ సంతోష్ లు రాంబో డాగ్ తో బ్యాంకు చుట్టూ పరిసరాలను తనిఖీ చేయించారు. ఫింగర్ ప్రింట్ సిబ్బంది బ్యాంకులోని లాకర్ ను అక్కడ దొంగలు వదిలి వెళ్ళిన ఇనుప రాడ్ పై వేలి ముద్రలు బ్యాంకులో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వేలిముద్రలను పోలీసులు ‌ సేకరించారు సీసీ కెమెరా ఫుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు బ్యాంకు లో ఏమీ పోలేదని ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని బ్యాంకు మేనేజర్ సంపూర్ణ తెలిపారు సిసి పుటేజీల ను పరిశీలించి బ్యాంకు దోపిడీ కి యత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు


తెలిపారు బ్యాంకు లో దోపిడీ విఫలయత్నం సమాచారం తెలుసుకున్న నాస్కాభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జరిగిన సంఘటన గురించి బ్యాంకు మేనేజర్ సంపూర్ణ ను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని దోపిడీ యత్నం గురించి అడిగి తెలుసుకున్నారు బ్యాంకు వద్ద నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని కొండూరి రవీందర్ రావు ను కోరారు