రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-17
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ
రెవెన్యూ అధికారులు మూల వాగు నుండి ఇసుక తీసుకోవడానికి అనుమతి ఇవ్వడంతో అజాగ్రత్తగా అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ డీకొని ఓ వ్యక్తి మరణించాడు వేములవాడ మండలం మల్లారం వద్ద ఇసుక రీచ్ ఏర్పాటు చేసి 60 ట్రాక్టర్లకు
మూడు ట్రిప్పు ల అనుమతి ఇచ్చారు కానీ అధికారుల అండదండలతో ఒక్కో ట్రాక్టర్ మూడు ట్రిప్పులకు బదులు పది ట్రిప్పుల వరకు ఇసుకను ఇసుక రీచ్ వద్ద ఒ రెవిన్యూ అధికారి ముందు నుంచే తరలిస్తారు అంటే ఎస్థాయిలో
ఇసుక రవాణాదారులు ముడుపులు చెల్లిస్తారో ఇట్టే అర్థమౌతుంది ఇసుక ట్రాక్టర్లు నడుపుతున్న డ్రైవర్లలో కొద్ది మంది కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం మైనర్ లు ట్రాక్టర్ లు తోలడం రోడ్డు భద్రతా నియమాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా అతివేగంగా రావడంతో పట్టణ శివారులో లాలపల్లె కి చెందిన తేలు కనకయ్య అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వేములవాడ నుండి ఇంటికి వెళ్తుండగా అతివేగంగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
తమకు న్యాయం చేయాలని
మృతుడి బంధువులు మృతదేహంతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని
దర్యాప్తు చేస్తున్నారు.