జిల్లాలో జోరుగా పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా-
అక్రమార్కులకు దన్నుగా పౌరసరఫరాల శాఖ అధికారులు
పౌరసరఫరాల శాఖ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు
బీదలు తినే బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి
ప్రజా ప్రతినిధుల అండతో యదేచ్చగా పిడిఎస్ బియ్యం రవాణా.
తెలంగాణ కెరటం జిల్లా ప్రతినిధి:
గత రెండు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మరితో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు దీంతో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని అన్ని రాష్ట్రాలలో బీద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. జిల్లాలో ప్రతిరోజు వందల టన్నుల పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టి అక్రమ వ్యాపారుల వైపు మళ్లడం లేదు.కామారెడ్డి జిల్లా కేంద్రంగా పిడిఎస్ బియ్యము అక్రమంగా రవాణా జరుగుతున్న పౌరసరపరాల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇంత యదేచ్ఛగా పిడిఎఫ్ బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని జిల్లా కేంద్రంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని పిడిఎఫ్ బియ్యం ప్రతిరోజు కొనుగోలు జరుగుతూన్నాయి. అయిన కూడా పౌరసరఫరాల శాఖ అధికారులు ఎన్నోసార్లు దాడులు చేసి జరిమానాలు విధించారు. ఆ బడా దందారులపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడంతో వాళ్ళ పైన యదేచ్చగా పిడిఎఫ్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ దందా నిర్వహిస్తున్నారు. వేరే ఎవరైనా పిడిఎఫ్ బియ్యం కొనుగోలు చేసిన అమ్మిన వారి పట్ల కఠినంగా వ్యవహరించే పౌరసరపరాల శాఖ అధికారులు వీరి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం పై కామారెడ్డి పట్టణ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బీదలు తినే బియ్యం దళారుల పాలు.
ఈ పథకం మొదటిసారిగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 14 జనవరి 1945న ప్రారంభించబడింది మరియు ప్రస్తుత రూపంలో జూన్ 1947లో ప్రారంభించబడింది. భారతదేశంలో రేషన్‌ను ప్రవేశపెట్టడం 1940ల బెంగాల్ కరువు కాలం నాటిది . హరిత విప్లవానికి ముందు 1960ల ప్రారంభంలో తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ రేషన్ వ్యవస్థ పునరుద్ధరించబడింది . ఇందులో ఆర్పిడిఎస్ మరియు టి పిడిఎస్ అనే రెండు రకాలు ఉంటాయి. 1992లో, పిడిఎస్ అనేది ఆర్ పిడిఎస్ (పునరుద్ధరణ చేయబడిన పిడిఎస్)గా మారింది, ముఖ్యంగా దూరప్రాంతాలు, కొండలు, మారుమూల మరియు దుర్గమ ప్రాంతాలలో ఉన్న పేద కుటుంబాలపై దృష్టి సారించింది. 1997లో ఆర్ పిడిఎస్ ,టిపిడీఎస్ (టార్గెటెడ్ పిడిఎస్)గా మారింది, ఇది సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాల పంపిణీ కోసం సరసమైన ధరల దుకాణాలను ఏర్పాటు చేసింది.
కేంద్రం రాష్ట్ర బాధ్యతలు
సవరించు
పిడిఎస్ని నియంత్రించే బాధ్యతను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా మరియు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుండగా, సరసమైన ధరల దుకాణాల (ఎఫ్‌పిఎస్‌లు) ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ ద్వారా వినియోగదారులకు పంపిణీ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కేటాయింపు మరియు గుర్తింపు, రేషన్ కార్డుల జారీ మరియు ఎఫ్పిఎస్ ల పనితీరును పర్యవేక్షించడం మరియు పర్యవేక్షించడం వంటి కార్యాచరణ బాధ్యతలకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి అనే విషయం తెలిసిందే,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
బీదలకు తినడానికి అందిస్తున్న పిడిఎఫ్ బియ్యం ను కొందరు అక్రమార్కుల వల్ల దళారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. తిరిగి వాటిని పిడిఎస్ బియ్యం గానే ప్రజలకు అందిస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి కోట్లలో నష్టం కలుగుతుంది. ప్రజలకు ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పిడిఎఫ్బియాన్ని అందిస్తుంది. కొంత మంది ఆ బియ్యాన్ని విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల రూపాయల్లో నష్టం కలుగుతున్న అధికారులు మాత్రం స్పందించడం లేదు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాల్సింది పోయి పౌరసరఫరాల శాఖ అధికారులు అక్రమార్కులకే వంతపడుతున్నారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం రైతుల వద్ద కొనుగోలు చేసిన వడ్లను ఇతర రైసుమిల్లలకు ఇచ్చి బియ్యం తీసుకుంటున్న సమయంలో రైస్ మిల్లర్లు పిడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వమిచ్చిన వడ్లను ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తు కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. వీటిపై నిఘ పెట్టవలసిన అధికారులు తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరించడంపై పట్టణ, జిల్లా ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పిడిఎస్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచారని సమాచారం ఇచ్చిన అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.