Saturday , October 12 2024

జిలేటిన్ పేలి ఉలిక్కిపడిన కొండాపూర్

ధ్వంసమైన ఇల్లు జరగని ప్రాణనష్టం

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి
ఆగష్టు:-03

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామం లో ఓ ఇంటి నుండి ఒక్కసారి పెద్ద శబ్దం రావడం తో గ్రామస్థులు


భయాందోళనకు గురయ్యారు గ్రామానికి చెందిన తుమ్మల రాములు ఇంట్లో జిలెటిన్ నిల్వ ఉంచాడు బుధవారం రాత్రి అవి ఒక్కసారి పేలడంతో తన ఇంటి తో పాటు గ్రామంలో చుట్టూ ఉన్న ఇండ్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అయితే గతంలో రాములు బండలు పగల కొట్టడానికి వాటిని ఉపయోగించేవాడని ఇప్పుడు ఆరోగ్యం బాగలేక ఏమి పని చేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు గతం లో తెచ్చినవే ఇంట్లో నిలువ ఉన్నాయని అను కోకుండా పేలాయని కుటుంబ సభ్యులు గ్రామస్తులకు తెలిపారు గతంలో కూడా కొండాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోవడంతో ఇంట్లో ఉన్న రెండు సిలెండర్ లు పేలడంతో గ్రామం భయంతో
ఉలిక్కిపడింది మళ్ళీ అలానే పెద్ద శబ్దంతో రావడంతో గ్రామస్తులు భయందోళనకు గురయ్యారు సర్పంచ్ దేవయ్య ను వివరణ కోరగా గతంలో ఇట్లో నిల్వవుంచిన వాటి వల్లే ఇల్లు ధ్వంసం అయిందనీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని కోనరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నాడు. సంఘటన


రాత్రి వేళ జరగడంతో పూర్తి వివరాలు తెలియవని సర్పంచ్ తెలిపారు ఇంకా కొన్ని ఉన్నాయని ఇంటి యజమాని తెలపడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.