Wednesday , July 24 2024

అట్టహాసంగా ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ ప్రమాణస్వీకారం

జవహర్ నగర్ ప్రతినిధి/ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ నాయకులు హాజరయ్యారు. టిపి వైయస్ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిపివైఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వంలో సోనియమ్మ ఆ దేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుపరిపాలంగా పరిపాలిస్తున్నాడని తెలంగాణను దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీ పి వైయస్ రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్, వైస్ ప్రెసిడెంట్ మూకర రవి, మరియు రాంపల్లి నరసింహ, మహేందర్, మల్లికార్జున్, మరియు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.