Wednesday , July 24 2024

జవహర్ నగర్ కార్పొరేషన్ కైవసం దిశగా కాంగ్రెస్ పార్టీ

జవహర్ నగర్ ప్రతినిధి (ఫిబ్రవరి 25)

మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బి ఆర్ ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఈరోజు బేషరతుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ప్రస్తుత మేయర్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా కార్పోరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. జవహర్ నగర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, _మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మరియు మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలిపెద్ది సుధీర్ రెడ్డి సమక్షంలో ఈరోజు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సందర్భంగా నాయకులు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని, బేషరతుగా చేరిన కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ లో మరింత బలోపేతం అవుతుందని, త్వరలోనే కార్పొరేషన్ ను కైవసం చేసుకుని జవహర్ నగర్ ప్రజానీకానికి సుపరిపాలన అందించే విధంగా తామంతా కృషి చేస్తామని చెప్పారు.