డిప్యూటీ మేయర్ – రెడ్డి శెట్టి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాన్ని మెరుగైన అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన పూర్తి బాధ్యత పాలక మండలి సభ్యులతో పాటు అధికారులపై ఉందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యలయంలో డిప్యూటి మేయర్ రెడ్డి శెట్టి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో కార్పొరేషన్ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై పాలక మండలి సభ్యులు అధికారుల సలహాలు సూచనలు తీసుకొని చర్చించి 2024- 2025 సంవత్సరమునకు గాను రూపాయలు 17,84,60,000 నిధుల అంచనా బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదిస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఎల్ తాజ్ మోహన్ రెడ్డి , డి ఇ మాధవ చారి, టి పి ఎస్ స్రవంతి, జె ఏ ఓ సంగీత మాధురి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, కో – ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.