కొల్లూరి రాజు ముదిరాజ్ మరణానికి కారణమైన వారిపైన చట్టపరమైన చర్యతీసుకోవాలి!
జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
చిన్నకోడూర్ న్యూస్
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండల్ బురుగుపల్లి గ్రామంలో ముదిరాజులకు సొసైటీలో సభ్యత్వాల ఇవ్వడానికి మత్య్సశాఖ అధికారులు స్కిల్ టెస్ట్ నిర్వహించి నెలలు గడిచిపోతున్న అప్పటికే సొసైటీలో ఉన్న బెస్తలు ఒప్పుకోకవడంతో అధికారులు కూడ ఏమి చేయకపోవడంతో గత శుక్రవారం రోజు బెస్తలు చెరువులో చేపలు పట్టడానికి పోయిన విషయం తెలుసుకొని ముదిరాజ్ యువకులు చెరువు వద్దకు పోయి చేపలు పట్టవద్దు మాకు కోర్టు ఆర్డర్ ఉన్నది మమ్ములను సొసైటీలో చేర్చుకోవాలి అని కోరగా బెస్తవాళ్ళు గొడవకు దిగి ముదిరాజ్ యువకులపై దాడి చేయడంతో నీటిలో పడిపోయిన కొల్లూరి రాజు ముదిరాజ్ అక్కడికక్కడి మృతి చెందాడు
ఇట్టి విషయమై ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ స్పందించి ప్రకటన విడుదల చేస్తూ నాటి నుండి నేటి వరకు ముదిరాజులకు అన్యాయం జరుగుతూనే ఉందని జిఓ 98/64 ప్రకారం ముదిరాజులు మత్య్సకారులుగా ఉన్న బెస్తవాళ్ళకు ముందుగ సొసైటీ ఐతే అందులో అవకాశం ఉన్న ముదిరాజులను చేర్చుకోవడం లేదని అడుగుతే కొట్టి చంపుతుంనారని బురుగుపల్లి ఘటనను ముదిరాజ్ సంఘం పక్షాన కండిస్తున్నానని రాజు మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలనీ లేకుంటే చలో బురుగుపల్లి ప్రకటించి రాష్ట్ర ముదిరాజులను ఏకం చేసి తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించకుంటే గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగిన ర్యాలీలు నిరసనలకంట్టే మిక్కిలి పోరాటం మొదలు పెడుతామని ఆలా జరిగితే ముదిరాజులను ఆపడం ప్రభుత్వ తరం కాదని ఆ పోరాటంలో ఏమైన జరగవచని ముదిరాజుల సహనాన్ని ప్రభుత్వం కానీ అధికారులు కానీ బెస్తలు కానీ పరిక్షించవద్దని జంగిటి అన్నారు.