Wednesday , July 24 2024

జనావాసాల మధ్యన పందుల పెంపకం..??

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 11:


ఆర్మూర్ పట్టణంలోని ఆర్ కే హాస్పిటల్ వెనకాల ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలాలలో పందుల పెంపకం నిర్వహిస్తున్నారు దీనితో కాలనీలో ఉండే ప్రజలకు ఇబ్బందికరంగానే కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి రానున్న వర్షాకాలంలో పందులతో విపరీతంగా అపరిశుభ్రత ఏర్పడుతుంది ఇంత జరుగుతున్న అధికారుల దృష్టికి రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా పందుల పెంపకం కోసం ప్రభుత్వం మున్సిపాలిటీ బయట 5 ఎకరాల భూమిని కేటాయించామని చెబుతున్నారు. ఆ కేటాయించిన భూమిలో పందుల పెంపక యజమానుల కు కౌన్సెలింగ్ ఇచ్చి అక్కడే పెంచే విధంగా చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమే పందుల పెంపకానికి 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చామని చెప్పుకుంటున్న అధికారులు ఎక్కడ ఇచ్చారు ఒకవేళ ఇస్తే పందుల పెంపక యజమానులు ఆ స్థలంలో కాకుండా ఇంటి వద్ద జనావాసాల మధ్య పెంపకాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు ఇది యజమానుల తప్పిదము అధికారుల నిర్లక్ష్యం తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఒకపక్క కుక్కల బెడదతో సతమవుతున్న ప్రజానీకానికి పందుల సమస్య తీవ్ర అసహనాన్ని గురిచేస్తుంది పందుల నుంచి వచ్చే మెదడువాపు వ్యాధి చిన్నపిల్లలలో తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది ఇవన్నీ తెలిసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక కౌన్సిలర్లు వారి ప్రదేశంలో ఉండే యజమానులతో మాట్లాడి ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రాకముందే సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.