Tuesday , July 16 2024

ప్రజల్లో ఎన్నికల పట్ల నమ్మకాన్ని కలిగించేoదుకే ప్లాగ్ మార్చ్…

*హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి, జమ్మికుంట సీఐ రవి

జమ్మికుంట మార్చి 03: తెలంగాణ కెరటం

జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు ఓటు పై నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించేoదుకే పోలీసులు బిఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి, జమ్మికుంట సిఐ వరగంటి రవి తెలిపారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో నీ ప్రధాన వీధుల గుండా పోలీస్ అధికారులు బిఎస్ఎఫ్ బలగాలు ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ప్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎసిపి శ్రీనివాస్ జి, సీఐ రవి మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలు 2024 లను ప్రశాంతంగా జరిపించే క్రమంలో మూడు కంపెనీల బిఎస్ఎఫ్ బలగాలు నియోజకవర్గానికి చేరుకున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బిఎస్ఎఫ్ బలగాలు జిల్లా యంత్రాంగంతో మమేకమై విధులు నిర్వహిస్తారని అన్నారు. అన్ని ప్రాంతాలలో వీరిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. సమాజంలో ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు చట్టాన్ని ఉల్లంగించడం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం వంటి చర్యలు చేపట్టే వారికి భయాన్ని కల్పించే దిశగా పోలీసు బిఎస్ఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం జమ్మికుంట రైల్వే స్టేషన్ నుండి ప్రధాన వీధుల గుండా గాంధీ చౌరస్తా బస్టాండ్ కరెంట్ ఆఫీస్ అంబేద్కర్ చౌరస్తా ప్రధాన వీధుల గుండా కొనసాగింది.ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్ జి కమాండోలు, సిఐలు ఎస్సైలు బిఎస్ఎఫ్ బలగాలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.