జమ్మికుంట రూరల్ మార్చ్ 3: తెలంగాణ కెరటం
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కనవేన కొమురయ్య గుడ్ల దుర్గయ్య తీగల కొమురయ్య మృతి చెందగా విషయం తెలుసుకున్న పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఫౌండేషన్ నిర్వాహకుల ద్వారా ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున క్వింటాల్ యాభై కిలోల బియ్యాన్ని మృతుల కుటుంబాలకు పంపిణీ చేశారు. దీంతో పాటుగా నిత్యావసరాలలో భాగంగా ఆరు కిలోల నూనె ప్యాకెట్లను మృతుల కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో నిరుపేద కుటుంబాలకు మరిన్ని సామాజిక సేవలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పల్లె రవి గౌడ్ గండి రంజిత్ కుమార్ గౌడ్ గిరవేన రాజయ్య యాదవ్ తాటిగంటి వీరస్వామి తాటిగంటి ఐలయ్య కడవేరుగు సంపత్ గిరవేన బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.