Saturday , October 12 2024

జమ్మికుంటలో పల్స్ పోలియో విజయవంతం…

జమ్మికుంట మార్చి03: తెలంగాణ కిరీటం

పల్స్ పోలియోకార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 40 పల్స్ పోలియో బూతులు 4 రూట్ సూపర్వైజర్ 1 మొబైల్ టీం (డాక్టర్ ఫర్హాన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో జమ్మికుంట మండలం మున్సిపల్ పరిధిలోని ఐ రిస్క్ ప్రాంతాలు అయినా ఇటుక బట్టీలు పత్తి మిల్లులు, పౌల్ట్రీ ఫార్మ్) ద్వారా 0-5yrs లోపు పిల్లలు 5048 మందికి గాను 4795 మంది పిల్లలకు అనగా 95% మంది పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయడం జరిగిందని డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పోలియో చుక్కలు వేసకొనని మిగతా పిల్లలకు 4, 5 తేదీలలో 80 టీమ్ లతో ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పిల్లలందరూ (0-5yrs) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు పాత మున్సిపల్ ఆఫీసులో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు, అలాగే ఎంపీపీ శ్రీమతి దొడ్డే మమత ప్రసాద్ గ పెద్దంపల్లి గ్రామం ప్రైమరీ స్కూల్లో పల్స్ పోలియో కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ పరహానుద్దీన్, హిమబిందు, సంధ్యారాణి, మహోన్నత,సంధ్య, చందన,కార్తీక్, సాజిద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్,పంజాల ప్రతాప్ గౌడ్ హెల్త్ ఎడ్యుకేటర్,
సూపర్వైజర్స్ రత్నకుమారి, స్వరూప,అరుణ, సదానందం ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు ఆశాలు,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.